మా కుటుంబంలో చీలిక తెచ్చారు.. అయినా చెక్కుచెదరలేదు : వైఎస్ అవినాష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా ఈసారి సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జగన్ చెల్లెళ్లు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు ఆయనపై నేరుగా ఆరోపణలు చేయడమే కాకుండా.. స్వయంగా షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నేరుగా అన్న పైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటికి వైసీపీ క్యాంప్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి.
తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలోని ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. తాను ఎలాంటి వాడినో మా ప్రాంత ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. మూడేళ్లుగా తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో వున్నానని అవినాశ్ రెడ్డి చెప్పారు. చివరికి మా కుటుంబంలోనూ చీలికలు తెచ్చారని.. ఎన్ని కుట్రలు చేసినా తాను ప్రజల్లోనే వుంటానిన ఆయన తేల్చిచెప్పారు.
Also Read : తెలంగాణలో 90 లక్షల మంది యువ ఓటర్లు .. గెలుపైనా, ఓటమైనా వీరి చేతుల్లోనే..!!
గత 16 నెలలుగా వర్షాలు లేకపోయినా గండికోట, చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్ట్‌లను నింపడం వల్లే రైతులకు సాగు, తాగునీటికి ఇబ్బంది పడటంత లేదని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి గతంలో అధికారంలో వున్నప్పుడు హామీలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు దిగజారిపోతున్నారని.. 2014లో మాదిరిగానే అబద్ధపు హామీలను ఇస్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
— YS Avinash Reddy (@MP_YSRKADAPA) April 12, 2024
Comments
Post a Comment